FbTelugu

అయ్యా.. కోడిని అరెస్టు చేయలేదు: ఎస్సై జీవన్

జగిత్యాల: కోడి పేరు చెబితే పోలీసులు భయపడే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా పుణ్యామా అని కోడి హీరోగా మారగా, పోలీసులు మాత్రం తలలు పట్టుకున్నారు. అరెస్టు చేశారంటూ వైరల్ గా మారడంతో… దాన్ని అరెస్టు చేయలేదు మహాప్రభో అంటూ పోలీసులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు.

కోడి అరెస్టు కథ ఏంటో తెలుసుకుందాం. గొల్లపల్లి మండలం లొత్తునూర్ లో ఈ నెల22 న కోడి పందేలు నిర్వహించారు. వెల్గటూర్ మండలం కొండాపూర్ కు చెందిన తనుగు సంతోష్ కూడా పందెంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో సతీష్ తన కోడికి కత్తలు కట్టి వదిలేందుకు వంగాడు. అలా వంగగానే కోడి ఒక్కసారిగా లేచి సతీష్ మర్మాంగాలపై గట్టిగా తన్నింది. మర్మాంగాలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో గొల్లపల్లి ఎస్సై జీవన్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.
అకారణంగా ప్రాణం తీసిన కోడిని పోలీసులు తీసుకుని పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ లోపు ఒక వ్యక్తి దాని ఫొటోలు తీసి… అయ్యయ్యో కోడిని అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది అది వైరల్ అయి సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు గొల్లపల్లి ఎస్సై జీవన్ పై చివాట్లు పెట్టారు. ఘటనా ప్రాంతంలో కోడి ఉండడంతో సంరక్షించేందుకు పోలీసు స్టేషన్ తీసుకువచ్చామని, అబ్బె అరెస్టు చేయలేదంటూ మాట మార్చాడు. అరగంట తరువాత కోళ్ల ఫారానికి తరలించామని తన బాధను చెప్పకనే చెప్పారు. కోడి పందేలలో పాల్గొన్నవారి వివరాలు సేకరించామని, వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై జీవన్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.