FbTelugu

ఎస్సై మోసం.. నటి రాధ ఫిర్యాదు

చెన్నై: మరొక మహిళతో తిరుగుతున్నాడంటూ కట్టుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ప్రియురాలు… కాదు కాదు పెళ్లి చేసుకున్నాడని చెబుతున్న మహిళ కూడా తన వద్దకు రావడం లేదంటూ పోలీసు స్టేషన్ మెట్లెక్కడంతో పోలీసు ఎస్సై పరిస్థితి సంకటంగా మారింది.

భార్య, ప్రియురాలి కారణంగా జైలు కు వెళ్లక తప్పేలా లేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోలీవుడ్ కు చెందిన వర్థమాన నటి రాధ (38) తనను ఎస్సై వసంతరాజ్ మోస్ చేశాడంటూ చీటింగ్ కేసు పెట్టింది. అప్పటికే ఆయనపై కట్టుకున్న భార్య తనను పట్టించుకోకుండా వేరే మహిళతో తిరుగుతున్నాడంటూ కేసు పెట్టింది. పోలీసుల కథనం ప్రకారం సుందరం ట్రావెల్స్ సినిమాతో రాధ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. షూటింగ్ సందర్భంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. ఆమె  అప్పటికే వివాహం అయి విడాకులు తీసుకున్నది. ఇద్దరు సంతానం ఉన్న రాధ ఇంటికి ఎస్సై నిత్యం వచ్చి వెళ్తుండేవాడు. రాధ ను విడిచి ఉండలేక వసంత రాజ్ తిరువాన్మియూర్ నుంచి వడపళని స్టేషన్ కు బదిలీ చేయించుకున్నాడు.

పెళ్లి కూడా జరిగిపోవడంతో రాధ, తన ఆధార్ కార్డులో భర్త పేరు వసంత రాజ్ అని నమోదు చేయించింది. ఈ విషయం తెలిసిన తరువాత ఆమెను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. ఆ వెంటనే తన పోస్టింగ్ ను ఎన్నూరుకు మార్పించుకుని రాకపోవడంతో రాధ కు అనుమానం వచ్చింది. తనను పెళ్లి చేసుకున్న వసంతరాజ్ దూరం పెట్టడాన్ని తట్టుకోలేక ఆమె గురువారం విరుగ్గం బాక్కం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసు కావడంతో బెదిరింపులు కూడా చేస్తున్నాడని ఆమె ఉన్నతాధికారులకు తెలిపారు.

cinema industry

You might also like

Leave A Reply

Your email address will not be published.