FbTelugu

దొంగగా మారిన ఎస్సై

ఢిల్లీ: ఓ ఎస్సై ఘరానా దొంగగా మారి దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడుతుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే.. హర్యానాకు చెందిన అస్లూఫ్ అనే వ్యక్తి ఢిల్లీలో కొన్నాళ్లు ఎస్సైగా విధులు నిర్వహించారు.

కొన్ని కారణాల వలన అతని ఉద్యోగం పోయింది. దీంతో అతడు దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడడం మొదలు పెట్టాడు. హైదరాబాద్, సైబరాబాద్ సహా మరో ఏడు రాష్ట్రాల్లో 24 నేరాలకు పాల్పడ్డాడు. కాగా అస్లూఫ్ ను అల్వాల్ లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

You might also like