FbTelugu

మానవత్వం చాటిన ఎస్సై ఆనంద్

కృష్ణా: రెడ్డిగూడెం ఎస్సై డి.ఆనంద్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో ఇద్దరు కూలీలు మామిడి కోతకు వచ్చారు.
తోట సమీపంలో అడవి కొత్తూరు నూజివీడు బ్రాంచ్ కెనాల్ కాలువలోకి భోజనం చేయటానికి కాళ్ళు, చేతులు శుభ్రపరుచుకునేందుకు దిగారు.

ఈ క్రమంలో ప్రమాదపుశాత్తు దిగిన ఇద్దరు కూలీలు గల్లంతయ్యారు. ఈ విషయం తెలియగానే ఎస్సై ఆనంద్ కుమార్ వెంటనే గల్లంతైన వారి కోసం కాలువలోకి దిగారు. కందుల వాసు(14), బొలగాని వేణు (23) అనే కూలీల మృతదేహాలను స్వయంగా బయటకు తీసుకువచ్చారు. ఎస్సై ఆనంద్ కుమార్ ను పలువురు ప్రశంసించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.