FbTelugu

అయోధ్య రామమందిర నిర్మాణ పనులు షురూ

28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అయోధ్యలో ధార్మిక కార్యక్రమాలు ప్రారంభం అయినాయి. ఏండ్లనాటి అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలకడంతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

అయితే లాక్ డౌన్ కారణంగా నిర్మాణ పనులను ప్రారంభించలేదు. తాజాగా లాక్ డౌన్ కు సడలింపులను ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ అయోధ్యలో భూమిపూజ కార్యక్రమాలు ప్రారంభించారు. రామమందిర నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని ఇవాళ కుబేర గుట్టపై శివునికి మహంత్ లు రుద్రాభిషేకం చేశారు.

You might also like