FbTelugu

రేవ్ పార్టీలకు శ్రద్ధా కపూర్

ముంబై: బాలీవుడ్ నటీమణి శద్ధకపూర్ రేవ్ పార్టీలకు వెళ్లేదని సుశాంత్ సింగ్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తి నార్కొటిక కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు వెల్లడించింది.

సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ వినియోగంపై ఎన్సీబీ అధికారులు రియాను సుధీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. చిచోరే సినిమాలో శ్రద్ధా కో స్టార్ గా నటించింది. లోనావాల ఫాం హౌస్ లో జరిగే రేవ్ పార్టీలకు ఆమె తరచూ వెళ్లేదని రియా చెప్పింది. ఈమె తో పాటు సారా అలీఖాన్ కూడా వెళ్లేది. ఈ పార్టీలో గంజాయి, స్మోకింగ్ పేపర్స్, ఖరీదైన వోడ్కా వినియోగించేవారని తెలిపింది.

లోనావాల ఫాం హౌస్ లో తరచూ పార్టీలు జరుగుతాయని మేనేజర్ రయిస్ వెల్లడించినట్లు సమాచారం. సుశాంత్ లాక్ డౌన్ కు ముందు వారానికి ఒకటి, రెండు వచ్చేవాడని, లాక్ డౌన్ సమయంలో ఇక్కడే ఉండాలని ఫ్లాన్ చేసుకున్నట్లు తెలిపాడు. కొన్ని కారణాలతో వాటిని రద్దు చేసుకున్నాడని రయిస్ వెల్లడించాడు.

You might also like