FbTelugu

బ్లాక్ ఫంగస్ పై నరకం చూపిస్తున్నారు: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ఈ దేశంలో ప్రతి ఒక్కరూ నరకాన్ని చూస్తున్నారు… మేము కూడా అతీతులం కాదు… మాకు సాయం చేయాలని ఉన్నా చేయలేని నిస్సహాయులమంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

బ్లాక్ ఫంగస్ ఔషధాల కొరతపై ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశంలో ఉన్న దుర్భర స్థితిని చెప్పకనే చెబుతున్నాయి. ఆసుపత్రులలో బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్న రోగులకు మందుల సరఫరా జరిగేలా ఆశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. జడ్జిలు జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ జస్మిత్ సింగ్ తో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించింది. ఒక్కో రోగికి కనీసం వంద లిపోసోమల్ యాంపొటెరిసిన్ బి వాయిల్స్ అవసరం పడుతున్నాయని, వీటిని కూడా బ్లాక్ లో విక్రయిస్తున్నారని పిటీషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. విదేశాల నుంచి 2.3 లక్షల వాయిల్స్ తెప్పిస్తున్నామని కేంద్రం తరఫు న్యాయవాది తెలియచేయగా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ సంఖ్య ఏ ప్రాతిపదికన నిర్థారించారో చెప్పాలని నిలదీసింది. ఒకరికి మందు ఇవ్వాలని, ఇతరులకు ఇవ్వొద్దు అని ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. ఇండియాకు ఎప్పుడు చేరుకుంటాయి, ఆర్డర్ చేశారా లేదా అని ప్రశ్నించా, మే 24న ఆర్డర్ చేసినట్లు కేంద్రం తరఫు న్యాయవాది వివరించారు. ఈపాటికే మందులు రావాలి కాదా, అసలు ఇచ్చారా లేదా అని ప్రశ్నించింది. ఈ వ్యాధి పూట పూటకు మారుతోందని, ప్రతి రోజు విలువైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రోగుల ప్రాణాలు కాపాడ్డం ఇక్కడ ముఖ్య, ప్రతి నిమిషం విలువైనదంటూ హైకోర్టు కేంద్రం పై అసహనం వ్యక్తం చేస్తూ ముగించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.