FbTelugu

ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు షోకాజ్‌

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం పనితీరును తూర్పారబట్టి, పార్టీ విధానాలను ప్రశ్నించిన నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు పార్టీ అధిష్టానం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.
ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వైసీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఈ నోటీసు జారీ చేశారు.

ఇటీవలి కాలంలో పార్టీ, ప్రభుత్వంపై మీరు చేసిన వ్యాఖ్యలు పార్టీ సభ్యుడిగా ఉండడం పట్ల మీ అయిష్టతను తెలియచేస్తున్నాయి. అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మీరు టీవీ చర్చల్లో విమర్శించారు. పార్టీ పట్ల విశ్వసనీయత ప్రదర్శిస్తున్న ప్రజా ప్రతినిధులను పందులతో పోల్చారని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

You might also like