FbTelugu

అమెరికాలో మాస్కుల పంపిణీ తప్పదా!?

వాషింగ్టన్: అమెరికాలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ నియంత్రణలోకి రావడం లేదు. పాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఎలా ఉందో నూతన అధ్యక్షుడు జోసెఫ్ ఆర్. బైడెన్ హాయంలోనూ అదే పరిస్థితి.

కరోనా ఉద్ధృతని తగ్గించేందుకు బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని పౌరులందరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలి నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత తొందరగా పౌరులందరికీ మాస్కులు పంపిణీ చేయనున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనే పంపిణీ చేయాలని భావించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బైడెన్ అధికారంలోకి రాగానే కరోనా నివారణకు వందరోజుల కార్యాచరణ ప్రకటించారు. ప్రజలందరూ తప్పకుండా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు. అయినా కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.