FbTelugu

బాబు అరెస్ట్ తప్పదా?

తిరుపతి: రేణిగుంట ఆంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నేడు చిత్తూరు, పుత్తూరు, తిరుపతి గాంధీ విగ్రహాల వద్ద ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నిరసన చేపట్టనున్నారు.

అయితే చంద్రబాబు పర్యటనకు పోలీసుల అనుమతి నిరాకరించారు. చంద్రబాబును ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన దృష్ట్యా టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొవిడ్, ఎన్నికల నియమావళి అమలులో ఉందంటున్నారు. టీడీపీ నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.