FbTelugu

విశాఖలో కట్టెల కొరత

విశాఖపట్నం: విశాఖ లో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. కరోనా మృతదేహాలు శ్మశానవాటికకు క్యూ కడుతున్నాయి. మృతదేహాలను కాల్చేందుకు కట్టెల కొరత ఏర్పడింది. గంటల తరబడి అంబులెన్స్‌ల్లోనే మృతదేహాలు ఉండిపోతున్నాయి. మృతదేహాలు కాల్చడానికి కట్టెలకు విపరీతమైన డిమాండ్ రావడం తో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

లోడు కట్టెలు రూ.5 వేల నుంచి 7 వేలకు అమ్ముతున్నారు. కట్టెలు లేకపోవడంతో పచ్చి కర్రలతోనే దహన సంస్కారాలు చేస్తూ పని పూర్తి చేస్తున్నారు. అసంపూర్తిగా కాలిన స్థితిలో కరోనా మృతదేహాలు ఉన్నాయి. ఆందోళనలో శ్మశానవాటిక పరిసర ప్రాంత వాసులు ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.