FbTelugu

బెజవాడలో మధ్యాహ్నం 2వరకే షాపులు

విజయవాడ: బెజవాడలో మధ్యాహ్నం రెండు గంటల తరువాత షాపులు మూసివేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సాయంత్రం 6 గంటల వరకు‌ వ్యాపారాలు సాగుతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో పని వేళలల్లో మార్పులు చేసినట్లు ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తెలిపింది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి బెజవాడ వ్యాప్తంగా ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని పేర్కోంది. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి, శానిటైజర్స్ వినియోగించాలని సూచించారు. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రజా శేయస్సు దృష్ట్యా మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు చేయాలని నిర్ణయించామని చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.
ఈ నిర్ణయాన్ని వర్తక, వాణిజ్య, వ్యాపారులందరూ పాటించి సహకరించాలని కోరారు. అత్యవసర సేవలకు సంబంధించిన షాపులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలోని మండలంలో ఉన్న వ్యాపారులు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.