FbTelugu

రాత్రి 8 వరకు షాపులు: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్  నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో కేసీఆర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మైంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు.

కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని కోరారు. ఇతర రాష్ట్రాల రాకపోకలు కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదని ఆయన చెప్పారు.

You might also like