FbTelugu

షాపు తాళాలు పగులగొట్టి.. నగదు చోరీ

కృష్ణా: మెడికల్ షాపు తాళాలను కొందరు గుర్తుతెలియని దుండగులు పగులగొట్టి రూ.70 వేల నగదును అపహరించిన ఘటన జిల్లాలోని హనుమాన్ జంక్షన్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక హనుమాన్ జంక్షన్ లోని ఓ మెడికల్ షాపుకు తాళం వేసి యజమాని వెళ్లిపోయిన తర్వాత కొందరు గుర్తుతెలియని దుండగులు ఆ షాపుకు వేసిన తాళాన్ని పగులగొట్టి రూ.70 వేల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like