FbTelugu

నిలిచిపోయిన టీవీ సీరియళ్ల షుటింగ్స్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో టీవీ సీరియల్స్ షూటింగులు పూర్తిగా నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

భవిష్యత్తు కార్యాచరణపై నటీనటులు, నిర్మాతలు సమాలోచనలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం గతంలో పరిమిత సంఖ్యలో కోవిడ్ నిబందనలు పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ లు నిర్వహించే పరిస్థితి లేనట్టే పలువురు భావిస్తున్నారు.

You might also like