FbTelugu

కరోనా… షూట్ టూ కిల్ ఆదేశాలు

వాషింగ్టన్: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే ఉంటుంది. ఆయన నిర్ణయాలు ప్రపంచ దేశాల్లోని ప్రజలకు ఒకింత భయాందోళనకు గురి చేస్తుందనే చెప్పాలి.

చైనా దేశం నుంచి కరోనా వైరస్ నార్త్ కొరియా దేశంలోకి ప్రవేశించకుండా తీవ్రమైన, అమానుషమైన ఆదేశాలు జారీ చేశారు. చైనా నుంచి తమ దేశంలోకి వచ్చే వ్యక్తులపై అధ్యక్షుడు కిమ్ జోంగ్ షూట్ టూ కిల్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని సౌత్ కొరియాలోని అమెరికా బలగాల కమాండ్ జనరల్ రాబర్డ్ అబ్రహం తెలిపారు.

ప్రపంచ దేశాలనే ఈ మహమ్మారి వణికిస్తుండగా ఇప్పటి వరకు నార్త్ కొరియాలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి, ఎంత మంది చనిపోయారనే విషయాలు వెలుగు చూడ్డం లేదు. చైనా నుంచి వైరస్ ను నిలువరించేందుకు గత జనవరిలో లో బార్డర్లను మూసివేసి, ఒక కిలోమీటర్ మేర బఫర్ జోన్ పెట్టారు. దాదాపు ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారనే చెప్పాలి. ఈ విషయాన్ని వాషింగ్టన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఆన్ లైన్ కాన్పరెన్స్ లో అబ్రహం వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.