FbTelugu

వైసీపీ ఎంపీ కి షాక్

విశాఖపట్నం: అనకాపల్లి వైసీపీ ఎంపీ సత్యవతికి రెవెన్యూ అధికారులు గట్టి షాక్‌ ఇచ్చారు. దారి మళ్లిన రేషన్ బియ్యం కేసులో ఎంపీ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న వివేకానంద ట్రస్టుపై 6ఏ కేసు పెట్టాలని జేసీ శివశంకర్ ఆదేశించారు.

అదే విధంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని, 30వ నెంబరు రేషన్ డీలర్‌ను సస్పెండ్‌ చేశారు. వాహనాన్ని దారిమళ్లించిన కాంట్రాక్టర్‌-2 వాహనాన్ని సీజ్‌ చేసి, బ్లాక్‌ లిస్టులో పెట్టారు.

ఎంపీ కుటుంబానికి చెందిన కల్యాణ మండపంలో సోమవారం రాత్రి చౌక బియ్యం అన్‌లోడ్‌ చేస్తుండగా సీపీఎం నేతలు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఎంపీ సత్యవతి పుట్టిన రోజు వేడుకలకు రేషన్‌ బియ్యం దారిమళ్లించారని సీపీఎం నేతలు ఆరోపించారు. ఈ వార్త మీడియాలో రావడంతో జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ అనకాపల్లి వెళ్లి విచారణ జరిపారు.

శంకరం గ్రామంలో వున్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌(రేషన్‌ గోదాము)లో ఏఎస్‌వో కోటి మధు, సీఎస్‌డీటీ జయ తనిఖీలు చేపట్టారు. గోదాము ఇన్‌చార్జి కె.రమణను విచారించారు. రేషన్‌ డిపోలకు వెళ్లాల్సిన లారీ పక్కదారి ఎందుకు పట్టింది? దీనికి  బాధ్యులు ఎవరు?, వంటి పలు విషయాల గురించి ఆరా తీశారు.

బియ్యం దారిమళ్లింపు వాస్తవమేనని విచారణలో తేలడంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని సస్పెండ్‌ చేశారు. అలాగే 30వ నెంబర్ రేషన్ డీలర్‌ను కూడా సస్పెండ్‌ చేశారు. వాహనాన్ని దారిమళ్లించిన కాంట్రాక్టర్‌-2 వాహనాన్ని సీజ్‌ చేసి, బ్లాక్‌ లిస్టులో పెట్టారు. ఎంపీ ట్రస్టుపై 6ఏ కేసు పెట్టాలని డిప్యూటీ తహసీల్దార్‌ను జేసీ ఆదేశించారు.

You might also like