FbTelugu

వాట్సప్ యూజర్లకు షాక్

కాలిఫోర్నియా: వాట్పప్ లేకుండా మనిషి ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సప్ ఎప్పటికప్పుడు మార్పులు తెస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన మార్పులు ఒక ఎత్తు కాగా, రానున్న మార్పులు మరో ఎత్తు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు వాట్సప్ ప్రకటించింది. కొత్త నిబంధనలు అంగీకరించని వినియోగదారుల ఫోన్లలో ఇది పనిచేయదు. కొత్తగా వచ్చిన నిబంధనలు అంగీకరించాలి లేదా అక్కౌంట్ ను డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్స్ పై ఏ కంపెనీ కూడా అంతగా వివరాలు వెల్లడించదు. కాని త్వరలో తీసుకురానున్న ఫీచర్ పై ముందుగానే ప్రకటన చేయడం ఆందోళన కలిగించే అంశం.

కొత్త అప్ డేట్ లో యూజర్ డేటా ను వాట్సప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ ఎలా ఉపయోగించుకుంటుందనే దానిపై మరింత సమాచారంతో రానున్నట్లు తెలిపింది. వ్యాపార అవసరాలకు ఎలా ఉపయోగిస్తారనేది కూడా వివరించనట్లు వెల్లడించింది. త్వరలో ఈ కొత్త నిబంధనలు వెల్లడించనున్నట్లు వాట్సప్ ప్రకటించింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.