FbTelugu

వర్మకు షాక్.. హైకోర్టు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలకు, వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గత కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశపై అత్యాచారం, హత్య నిందితుల ఎన్ కౌంటర్ ప్రధాన కథాంశంగా.. వర్మ ‘‘దిశ ఎన్ కౌంటర్’’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆద్యాంతం వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ ఘటన నిందితుల కుటుంబ సభ్యులు ‘దిశ ఎన్ కౌంటర్’ చిత్రాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దర్శకుడు రాంగోపాల్ వర్మను న్యాయస్థానం వివరణ కోరుతూ.. తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.