FbTelugu

విజయవాడలో స్విగ్గీకి షాక్

విజయవాడలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి షాక్ తగిలింది. విజయవాడ హోటల్ యాజమాన్యాలు “సే నో టూ స్విగ్గీ” నినాదంతో యాప్ నుంచి లాగ్ ఆఫ్ కావాలని నిర్ణయించాయి. స్విగ్గీ హిడెన్ ఛార్జీల రూపంలో ఆర్డర్ల విలువపై భారీ మొత్తాన్ని ఛార్జ్ చేస్తుండడంతో ఇవాళ స్విగ్గీ యాజమాన్యంతో విజయవాడ హోటల్స్ అసోసియేషన్ చర్చలు నిర్వహించింది. ఈ చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి స్విగ్గీ యాప్ నుంచి లాగ్ అవుట్ కావాలని నగరంలోని అన్ని హోటళ్లు నిర్ణయించాయి. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఆన్ లైన్ లో స్విగ్గీ యాప్ నుంచి హోటళ్లన్నీ లాగ్ అవుట్ కావాలని నిర్ణయించాయి. దీంతో సోమవారం నుంచి విజయవాడలో స్విగ్గీ ఆర్డర్లు నిలిచిపోనున్నాయి.

You might also like