FbTelugu

ఏపీఎస్ఆర్టీసీలో 6 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఏకంగా 6 వేల మందిపై వేటువేస్తూ డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు.

అయితే ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులకు ఏప్రిల్ నెల జీతాలు కూడా అందలేదని, ఈ తరుణంలో ఆర్టీసీ ఆజమాన్య తీరును కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తక్షణమే ఈ చర్యలను వెనక్కి తీసుకోకుంటే స్ట్రైక్ చేస్తామని హెచ్చరించారు.

You might also like