FbTelugu

ఏపీలో వారికి షాక్‌!

ఏపీలో ఆ రాష్ట్ర సర్కార్‌ కొన్ని వర్గాలకు షాక్‌ ఇచ్చింది. వారికి రాయితీలు చెల్లవని తేల్చి చెప్పింది. ఏపీ సర్కారు గురువారం నుంచి బస్సు సర్వీసులను నడుపుతుంది. కానీ, ఆ బస్సుల్లో వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీలను ఆపేసింది. ఇందులో ప్రధానంగా వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు.

వీరంతా ఇకనుంచి మామూలు ప్రయాణికుల్లాగానే టికెట్లు తీసుకొని ప్రయాణించాలని సర్కారు తేల్చి చెప్పింది. రాయితీలపై ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు సహా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతుంది.

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో బస్సుల్లో సీట్ల సంఖ్యను కుదించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌ లగ్జరీ సహా ఏసీ సర్వీసుల్లో సీట్లను తగ్గించింది. దీంతో ఆర్థికంగా సంస్థకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వివరించింది. సో, కొంతకాలం వీరంతా పూర్తిస్థాయి టికెట్లు కొని ప్రయాణించాల్సిందే మరి.!

You might also like