FbTelugu

పెట్రోల్‌, డీజిల్‌ ధరల షాక్

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదల ఆగడం లేదు. కరోనా మహమ్మారి సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుకుంటూ పోతున్నది.
పెట్రోల్‌పై లీటర్‌కు 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 33 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.53కు, డీజిల్‌ లీటర్‌కు రూ.82.06కు చేరింది. ముంబయిలో రూ.97.86, రూ.89.17, చెన్నైలో రూ.93.38, రూ.86.93, కోల్‌కతాలో రూ.91.66, రూ.84.90కు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.95.13కు, డిజిల్ ధర రూ.89.47కు చేరాయి.

ఇప్పటికే దేశంలో పలు చోట్ల ప్రీమియం పెట్రోల్ లీటర్ ధరలు రూ.100 దాటాయి. ఈ క్రమంలో మళ్లీ ధరలు పెరుగడంతో తమ వాహనాలు బయటకు తీసేందుకు ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.