ఢిల్లీ: ప్లాస్మా థెరఫీ అనుసరించి కరోనా పాజిటివ్ బాధితుడికి చికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని, చట్ట విరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ అగర్వాల్ స్పష్టం చేశారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ చికిత్స కేవలం ప్రయోగ దశలోనే ఉందని, ఇదే చికిత్సా విధానమని శాస్త్రీయ ఆధారం లేదని అన్నారు. ఐసీఎం అధ్యయనం పూర్తయ్యే లోపు, శాస్త్రీయ నిరూపణ జరిగే వరకు దీన్ని ప్రయోగం గా పరిగణించాలని ఆయన అన్నారు.
కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం పలు రాష్ట్రాలలో ఫ్లాస్మా థెరఫీ ద్వారా చికిత్సనందిస్తున్నారు. మార్గదర్శకాలు పాటించకుండా అందిస్తే రోగి ప్రాణానికే ముప్పు ఉంటుందని లవ అగర్వాల్ హెచ్చరించారు.