FbTelugu

‘గాంధీ’ కుటుంబనికి షాక్

Shock-for-Gandhi-family

ఎస్పీజీ భద్రత తొలగింపు!

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రాలకు ప్రస్తుతం కల్పిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ)ను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించిందని తెలిసింది. ప్రస్తుతంవీరికి ఉన్న ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించి, జడ్ ప్లస్ కేటిగిరి భద్రత కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం. ఎస్పీజీ భద్రతను కేవలం రాష్ట్రపతి, దేశ ప్రధానికి మాత్రమే కేటాయిస్తారని, ఇతర నేతలకు అవసరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీజీ చట్టానికి సవరణ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె దీనిపై కాంగ్రెస్ నేతలు సీరియస్ గా స్పందించారు. గాంధీల ప్రాణాలతో కేంద్రం రాజీ పడుతోందన్నారు.గాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియన్ నేత అహ్మద్ పటేల్ మండిపడ్డారు

You might also like