FbTelugu

వణుకుతున్న మహారాష్ట్ర పోలీసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభన ఆగడం లేదు. ఈ మహమ్మారి మహారాష్ట్ర పొలీస్ శాఖను వణికిస్తున్నది.

ఇప్పటి వరకు 1007 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ బారిన పడి ఏడుగురు పోలీసుల మృతి చెందారు. ఇవ్వాళ ఒక్కరోజే 221మంది పోలీసులకు కరోనా వైరస్ సోకడం సంచలనంగా మారింది.

మహారాష్ట్ర పోలీసు విభాగంలో సుమారు 1.95 లక్షల మంది సిబ్బంది పనిచేస్తుండగా ఒక్క ముంబై మహానగరంలోనే 94 పోలీసు స్టేషన్లు, 102 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు వంతుల్లో ఒక వంతు భాగం పోలీసులు ముంబైలో విధులు నిర్వర్తిస్తున్నారు.

తీహార్ జైల్లో ఖైదీకి పాజిటివ్…

ఢిల్లీ తీహార్ జైల్లో ఒక రిమాండ్ ఖైదీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ వ్యక్తి ఇటీవలే అత్యాచారం ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. నిందితుడికి న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్టు రావడంతో జైలు సిబ్బంది ఉలిక్కి పడ్డారు.  సన్నిహితంగా ఉన్నవారిని, బ్యారక్ సమీపంలో డ్యూటీ చేసిన సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.