FbTelugu

సోనూసూద్ పై శివసేన వ్యంగ్యాస్త్రాలు

దేశంలో కరోనా నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలేమీ లేకుండా ఒక్కసారిగా విధించిన లాక్ డౌన్ తో లక్షలాది వలస కూలీలు వర్ణణాతీత కష్టాలను ఎదుర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తనవంతు సాయంగా బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో సోనూసూద్ వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపేందుకు బస్సులు, రైళ్లు, ఆఖరికి విమానాల్లో కూడా వారిని పంపేందుకు కృషిచేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి మదిలో దేవునిగా నిలిచిపోయాడు. కానీ ఈ విషయం శివసేనకు ఎందుకో మింగుడు పడడం లేదు.

అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న చందంగా శివసేన తీరు మారింది. ‘కొత్త మహాత్ముడు’ ఊడిపడ్డాడని త్వరలోనే ప్రధానిని కలుస్తాడని, ముంబయి మహానగరానికి ‘సెలబ్రిటీ మేనేజర్’ అయిపోతాడంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేసింది. శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యాలు చేశాడు. లాక్ డౌన్ అమలులో ఉండగా సోనూసూద్ బస్సుల్లో పంపిన వలస కూలీలను రాష్ట్రాలు ఎలా అనుమతించాయని ఎదురు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.