FbTelugu

శివసేన నాయకుడే ముఖ్యమంత్రి: ఎంపీ సంజయ్ రౌత్

Shiv-Sena-Leader-would-Chief-Minister-to-maharastra-says-MP-Sanjay-Raut

ముంబై : మహారాష్ట్రకు శివసేన నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మహా ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.. కాగా బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సత్తా తమకు ఉందని  సంజయ్‌ అన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంబన వీడని విషయం తెలిసిందే. కూటమిగా ఎన్నికల బరిలో దిగిన కాషాయ పార్టీలు బీజేపీ- శివసేన మధ్య ‘ముఖ్యమంత్రి పీఠం’ చిచ్చుపెట్టింది. ఐదేళ్లపాటు తానే మహారాష్ట్ర సీఎంగా ఉంటానని బీజేపీ శాసనసభా పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పష్టం చేయగా… సీఎం పదవిపై శివసేన పట్టువీడటం లేదు. అంతేగాకుండా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో చర్చలకు తెరలేపి మహా రాజకీయాన్ని రసకందాయకంలో పడేసింది. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శరద్‌ పవార్‌ను ఆయన నివాసంలో కలుసుకున్న అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదన్నారు.

You might also like