FbTelugu

పంజాబ్ లో బి.ఎస్.పితో పొత్తు: అకాలీదళ్

చంఢీగఢ్: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేందుకు రాజకీయ పార్టీలు పొత్తులు ఖరారు చేసుకుంటున్నాయి. బి.ఎస్.పి తో కలిసి పోటీ చేస్తామని శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది.
ఇవా మీడియా అకాళీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.

రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వీటిలో 20 స్థానాలు బి.ఎస్.పి కి కేటాయిస్తున్నామన్నారు. మిగతా 97 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ గతేడాది శిరోమణి అకాలీదళ్ పార్టీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నది. రైతుల కు వ్యతిరేకంగా చట్టాలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుని, ఉద్యమంలో పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.