FbTelugu

ఈఎస్ఐ లో కూడా డొల్ల కంపెనీలే…

Shell-Companies-in-ESI-Scam

హైదరాబాద్: ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి డొల్ల కంపెనీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తేజ ఫార్మా కంపెనీ రాజేశ్వర్ రెడ్డి తమ్ముడు శ్రీనివాస రెడ్డి పేరిట రెండు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ రెండు కంపెనీల పేరిట డైరెక్టర్ దేవికా రాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి కోట్ల రూపాయలు దండుకున్నారు. డొల్ల కంపెనీల పేరిట నొక్కేసిన డబ్బుతో దేవికా రాణి రూ.3 కోట్ల మేర విలువైన బంగారం, ఆభరణాలు కొన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అల్వాల్ లోని శ్రీనివాస రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

You might also like