FbTelugu

షేక్ పేట్ తహశీల్దార్ భర్త ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని షేక్ పేట్ తహశీల్దార్ సుజాత భర్త అజయ్ చిక్కడపల్లిలోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్ లో రూ.40 కోట్ల భూవ్యవహారంలో తహశీల్దార్ సుజాత ఏసీబీకీ పట్టుబడిన విషయం తెలిసిందే.

ఈ లంచం కేసు నేపథ్యంలో  అరెస్టయిన సుజాత రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.