పెద్దపల్లి: కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల ఖననం విషయంలో కూడా మానవత్వం చాటడం లేదు.
చనిపోయిన వారిని కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు. దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పెద్దపల్లి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకున్నది. కరోనా చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందాడు. అంబూలెన్స్ అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్ లో మృతదేహాన్ని స్మశాన వాటిక వరకు తరలించాలని నిర్ణయించారు.
ట్రాక్టర్ నడపనని డ్రైవర్ తెగేసి చెప్పడంతో అక్కడే ఉన్న సుల్తానాబాద్ కు చెందిన డాక్టర్ శ్రీరామ్ ముందుకు వచ్చాడు. పీపీఈ కిట్ ధరించి తనే స్వయంగా ట్రాక్టర్ ను స్మశాన వాటిక వరకు నడిపించారు. అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత తిరిగి హాస్పిటల్ కు చేరుకున్నారు. మానవత్వం చాటుకున్న డాక్టర్ శ్రీరామ్ పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.