FbTelugu

సాక్షి మీడియాపై షర్మిల రుస రుసలు

హైదరాబాద్: వైఎస్.షర్మిల సాక్షి మీడియా పై ఇవాళ రుసరుసలాడారు. మీరు మాకెలాగు కవరేజి ఇవ్వరు, వెళ్లిపోవాలని కెమెరా మెన్ పై విసుక్కున్నది. ఇది చూసిన సభికులు, వేదికపై ఉన్నవారు విస్తుపోయారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ షర్మిల ఇందిరా పార్క్ వద్ద దీక్ష కు కూర్చున్నది. ఈ దీక్షకు తల్లి వైఎస్.విజయలక్ష్మీ కూడా హాజరైంది. ఆమె మాట్లాడుతున్న సమయంలో సాక్షి కెమెరా మెన్ ముందుకు వచ్చి లైవ్ లో ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సాక్షి కవరేజి మాకు వద్దని, మీరు వెళ్లిపోవాలని వ్యాఖ్యానించడంతో అక్కడున్నవారందరూ కంగు తిన్నారు. పక్కనే ఉణ్న తల్లి విజయలక్ష్మీ వారించి, ఊరుకోవాలని సూచించింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.