FbTelugu

నేడు ఖమ్మంలో షర్మిల సభ

ఖమ్మం: ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్. షర్మిల ఇవాళ ఖమ్మంలో నిర్వహించనున్న ‘సంకల్పసభ’కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనం భారీగా సభకు తరలివచ్చేలా సిద్ధం చేశారు.

ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో జరగనున్న ఈ సభకు ‘సంకల్ప సభ’అని పేరు పెట్టారు. ఇవాళ ఉదయం భారీ కాన్వాయ్ తో షర్మిల లోటస్ పాండ్ నుంచి ఖమ్మం బయలుదేరారు. సూర్యాపేట, పాలేరు మీదుగా ఖమ్మం చేరుకోనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఈ సభలో తూర్పారబట్టనున్నారు. ప్రజల ఆకాంక్ష అయిన రాజన్న రాజ్యం తెచ్చేలా ఈ సభ నుంచి షర్మిలమ్మ సంకల్పం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన స్వంత నియోజకవర్గంగా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సభల ప్రధానంగా గిరిజనుల సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంది. కరోనా దృష్ట్యా సభ నిర్వహణకు పోలీసులు ఆంక్షలు విధించారు.

లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించినా ఆరు వేల మందికి మించి హాజరు కాకూడదని పోలీసులు నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఆంక్షల నడుమ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో షర్మిల అనుచరులు ఉన్నారు. వైఎస్.విజయలక్ష్మీ ఈ సభకు హాజరవుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.