FbTelugu

షర్మిల పార్టీ పేరు ప్రకటన తేదీ ఖరారు

హైదరాబాద్: వైఎస్.షర్మిల పార్టీ పేరును ఖరారు చేసి ప్రకటించేందుకు ముహూర్తం నిర్ణయించింది. ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించనున్నారు.

ఖమ్మం జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల సుధీర్ఘంగా చర్చించారు. ‘వైఎస్సార్‌ టీపీ’ లేదా ‘వైఎస్సార్‌ పీటీ’.. రాజన్నరాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక పేరును ఆ రోజున ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.