FbTelugu

కట్నం ఇవ్వలేదని భార్య నగ్న చిత్రాలు షేర్

చెన్నై: మానవత్వం మంట కలిసి పోతున్నది. నిండు నూరేళ్లు అండగా ఉంటానంటూ పెళ్లి నాడు ప్రమాణం చేసిన భర్తే… భార్య నగ్న చిత్రాలను బహిర్గతం చేశాడు.
ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరువొత్రియూర్ కు చెందిన విజయ్ భారతి(29) ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఒక మహిళలను వివాహం చేసుకున్నాడు.

ఇద్దరూ కొన్నాళ్ల పాటు సంసారం చేశారు. పెళ్లి సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.10 లక్షలు కట్నం డబ్బులు ఇవ్వడం లేదంటూ భర్త వేధింపులు మొదలు పెట్టాడు. భరించలేని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ఎంతకూ రాకుండా, డబ్బులు తీసుకురాకపోవడంతో భర్త ఆమెపై పగ పెంచుకున్నాడు. తన వద్ద ఉన్న భార్య నగ్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ గా మారి ఆమె మొబైల్ ఫోన్ లోకి షేర్ కావడం షాక్ కు గురైంది. తన ఫోటోలను ఎవరు షేర్ చేశారంటూ ఆరా తీసి, భర్త వద్ద ఉన్నవేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త విజయ్ భారిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.