FbTelugu

రిషికేశ్ లో శారదా పీఠాధిపతులు

విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వాములు రిషికేశ్ పయనమయ్యారు. శనివారం విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మర్గం ద్వారా రిషికేశ్ చేరుకున్నారు.

చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేశ్ వెళ్ళిన పీఠాధిపతులు అక్కడి గంగాతీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలోనే సెప్టెంబరు నెలాఖరు వరకు ఉండిపోతారు. అక్కడికి వెళ్లే ముందు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలోనే దేవతామూర్తులను దర్శించుకుని, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. ప్రతి సంవత్సరం తన చాతుర్మాస్య దీక్షను పవిత్ర గంగానదీ తీరంలో స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి చేపడ్తారు. జూలై 24వ తేదీన ప్రారంభమయ్యే దీక్ష సెప్టెంబరు 20వ తేదీ వరకు ఉంటుంది. పీఠం ఆధ్వర్యంలో జగద్గురు ఆదిశంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు సైతం రిషికేశ్ పయనమయ్యారు. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పిపిఈ కిట్లు, ఫేస్ షీల్డ్స్, మాస్కులు ధరింపజేసి ప్రత్యేక విమానంలో తమ వెంట రిషికేశ్ తీసుకెళ్లారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.