వాషింగ్టన్: భారత సంతతికి చెందిన విజయ్ శంకర్‌ను వాషింగ్టన్లో ఉన్న అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమించనున్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఒకవేళ ట్రంప్ ప్రతిపాదనకు సేనేట్ ఆమోదం తెలిపనట్లయితే, అప్పుడు కొలంబియా అప్పీల్ కోర్టుకు అసోసియేట్ జడ్జిగా విజయ్ శంకర్ నియమించనున్నారు. వాషింగ్టన్ డీసీలో కొలంబియా జిల్లా కోర్టు అత్యున్నతమైనది. శంకర్ ప్రస్తుతం న్యాయశాఖ నేర విభాగంలో సీనియర్ లిటిగేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.