FbTelugu

సిగ్గు, శరం లేని టీఆర్ఎస్ సర్కార్: బండి సంజయ్

హైకోర్టు కు ధన్యవాదాలు

హైదరాబాద్: ఓటర్ల విశ్వాసాన్ని నిలపెట్టిన హైకోర్టు కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకొని న్యాయ్యవస్థ పై ప్రజలకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచిందని ఆయన అన్నారు. ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయ వేసిందని, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాని సీఎం కేసీఆర్ ను సూచించారు. ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా దున్నపోతుమీద వాన పడ్డట్టుగానే పరిస్థితి ఉందని బండి సంజయ్ అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం ఇదని, అడ్డదారుల్లో గెలవాలని చూసిన టీఆర్ఎస్ పార్టీ కి ఇది చెంపపెట్టు అన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. టీఆర్ఎస్, ఎన్నికళ సంఘం ఎంత అనైతికంగా వ్యవహరించారో హైకోర్టు సాక్షిగా బట్టబయలు అయిందన్నారు. ప్రతీ గంటకు పోలింగ్ శాతం ప్రకటించిన సంఘం, సాయంత్రం 5 నుంచి 6.30 వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని ఎందుకు అప్పటికప్పుడే ప్రకటించలేదో చెప్పాలని బండి సంజయ్  డిమాండ్ చేశారు.

సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు 12% నుండి 18% శాతం ఎలా పెరిగింది ? . దీనిపై హైకోర్టు విచారణ జరపాలని సంజయ్ కోరారు. కొన్ని పోలింగ్ స్టేషన్ లలో ఉన్నట్టుండి 90% శాతానికి పోలింగ్ పెరిగింది, ఇందులో ఏదో గాంబ్లింగ్ జరిగింది అనే అనుమానం ఉంది, వాటిమీద కూడా విచారణ జరపాలన్నారు. దీనికి సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు?. ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ, ఎక్కడా ఎన్నికలు జరగలేదన్నారు. పెన్నుతో టిక్కులు పెట్టినా లెక్క పెట్టుర్రి అని సర్క్యులర్ విడుదల చెయ్యడం చూస్తుంటే అధికారం పోతదేమో అన్న ఆకలి, ఆపతి, ఆతృత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అన్నారు. ఎన్నికుట్రలు చేసిన బీజేపీ వైపే ప్రజలు ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలే సాక్ష్యాలని బండి సంజయ్ ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.