FbTelugu

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

విజయవాడ: రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించనున్నారు.

మూడు రోజులపాటూ అమ్మవారు శాకంబరీ దేవిగా దర్శనమివ్వనున్నారు. రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం టికెట్లను భక్తులు ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. అమ్మవారి ఆలయంలో కేశఖండనశాల కూడా ప్రారంభమైంది.

You might also like