FbTelugu

షేక్ పేట తహశీల్దార్ సుజాత అరెస్టు

హైదరాబాద్: బంజారాహిల్స్ లో కోట్లాది రూపాయల భూ కుంభకోణం కేసులో షేక్ పేట్ తహశీల్దార్ సీహెచ్.సుజాత ను ఏసీబీ అరెస్ట్ చేసింది.

భూ లావాదేవీల కేసులో ఆర్ ఐ నాగార్జున రెడ్డి రూ.15 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) కె.నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ ఎస్సై రవీంద్రనాయక్ అరెస్టు అయ్యారు. ఈ లావాదేవీలో భాగస్వామ్యమున్న తహశీల్దార్ సుజాతను మూడు రోజులుగా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సుజాత తన ఇంట్లో ఏసీబీ అధికారులకు దొరికిన రూ.30 లక్షల నగదు, బంగారు ఆభరణాలకు సరైన ఆధారాలు చూపలేక పోయారు.

భూ వివాదంలో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఇవాళ ఆమెను అరెస్టు చేసి, వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. మరికాసేపట్లో ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు.

You might also like