FbTelugu

బీజేపీలో చేరిన షహీన్ బాగ్ షూటర్

లక్నో: ఢిల్లీలో ఈ ఏడాది ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై కాల్పులకు తెగబడిన కపిల్ గుర్జార్ బీజేపీలో చేరారు. గజియాబాద్ బీజేపీ నేతల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

హిందుత్వం కోసం పనిచేస్తున్న బీజేపీలో చేరాలని ఇంతకు ముందే నిర్ణయించుకున్నానని కపిల్ గుర్జార్ తెలిపారు. షహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ వ్యతిరేకుల కారణంగా నిత్యం ట్రాఫిక్ నిలిచిపోయేదని, అందుకే కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఇంట్లో తన సోదరి వివాహం పెట్టుకున్నామని, ఎప్పుడూ ట్రాఫిక్ అంతరాయం ఉండడంతో పనులు చేసుకోలేకపోయామన్నారు. అందుకే ఉద్యమకారులపై ఆగ్రహం పెరిగిందని, గాలిలోకి కాల్పులు జరిపినట్లు కపిల్ తెలిపాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.