FbTelugu

ఎన్నికల్లో షాడో బృందాలను పెంచాలి: రమేష్ కుమార్

అనంతపురం: సజావుగా పంచాయతీ ఎన్నికలు జరిగేందుకు షాడో బృందాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

ఇవాళ అనంతపురంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, డివిజన్ స్థాయిలో అధికారులతో నిమ్మగడ్డ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏకగ్రీవాలపై రాజకీయ ఒత్తిళ్లు చేసేవారిపై నిఘా పెట్టేలా షాడో బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జరిగే అన్ని ఏకగ్రీవాలను దురుద్దేశంతో చూడలేమని, రాజకీయ పార్టీల అభ్యంతరాలపై పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సిబ్బందితోనే ఎన్నికలు జరుగుతాయని, కేంద్ర సిబ్బందిని రప్పించాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత జిల్లా బాధ్యులపై ఉందని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.