FbTelugu

మహిళా కండక్టర్లపై లైంగిక వేధింపులు !

Sexual-harassment-on-female-conductors

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికు సమ్మె నేపథ్యంలో.. ప్రభుత్వం తాత్కాలికంగా రోజువారీ వేతనం ప్రాతిపదికన డ్రైవర్ కు రూ.1500, కండక్టర్ కి రూ.1000 చొప్పున ఇస్తూ.. బస్సులను నడిపిస్తోంది. అయితే వెయ్యి రూపాయల కోసం ఆశపడి కండక్టర్ విధులు నిర్వహించడానికి వస్తున్నపేద మహిళల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయడం తోపాటూ.. శారీరకముగా కలిస్తేనే డ్యూటీకి పంపుతాము అని భద్రాచలం డిపోలో సెక్యూరిటీ ఇంచార్జీ నాగేశ్వరరావు, రాజు (ఆర్టీసీ పోలీసులు) వేధింపులకు గురిచేస్తున్నట్లు ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా తన లాంటి పేదవారిని, ఎవరి అండలేని వారినే టార్గెట్ గా చేసుకుని.. విధుల్లోకి చేరాలంటే లంచంతో పాటూ.. ‘ఇంకా ఏం లేదా’ అంటూ.. తమను లొంగదీసుకోవాలని చూస్తున్నట్టు సంబాషించిన ఒక ఆడియో టేప్ బహిర్గతమైంది.

You might also like