కొమురంభీమ్: జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో బెల్లంపల్లి, గోలేటీ, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు వెలికి తీతకు తీవ్ర ఆటంకం తలెత్తింది. దీంతో ఈ ఉదయమే షిప్ట్ పనులను నిలిపివేశారు.
బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోవడంతో సుమారు 900 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయినట్టు అధికారులు వెల్లడించారు. 50 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి వెలికితీత పనులకు బ్రేక్ పడింది.