FbTelugu

ఏడేండ్లయినా సాయం అందలేదు: రేవంత్

హైదరాబాద్: 2013 బక్రీద్ పండుగ ముందు రోజు పాక్ కాల్పుల్లో కాశ్మీర్ లోని బాలకోట్ లో మరణించిన లాన్స్ నాయక్ ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి ఏడేండ్లయినా ప్రభుత్వం సాయం అందలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. షాహిద్ లాన్స్ నాయక్ ఫిరోజ్ ఖాన్ మృతి చెందిన తర్వాత అతని కుటుంబానికి ప్రభుత్వం 200 గజాల స్థలం, 30 లక్షల రివార్డు ప్రకటించిందని అన్నారు. కానీ
ఏడు సంవత్సరాలుగా ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇస్తానన్న బెనిఫిట్స్ ఇవ్వలేదని అన్నారు.

ఇది దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ధైర్యవంతులకు తీవ్ర అవమానమన్నారు. షాహీద్ లాన్స్ నాయక్ ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సహాయం చేసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం షాహిద్ ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

You might also like