FbTelugu

సిక్కోలులో ఇంటింటా ఏడు వారాల సర్వే

జిల్లా కలెక్టర్ జే.నివాస్ ఆదేశాలు

శ్రీకాకుళం: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు జిల్లా కలెక్టర్ జే.నివాస్ బృహత్ కార్యక్రమానికి పూనుకున్నారు. ఇంటింటా సర్వే కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించారు. ఏడు వారాల పాటు ఇంటింటా సర్వే నిర్వహిస్తారు.

ప్రతి ఇంట్లో సర్వే చేయనున్నట్లు గ్రామాల్లో దండోరా వేయించారు. ఇంటింటా సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ఇందులో భాగంగా సప్త వార ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఏడు వారాలు ప్రతి ఇంటిని విధిగా సందర్శించడం సప్త వార ప్రక్రియ లక్ష్యం అని ప్రజలకు తెలియచేశారు.

ఇంటిని సందర్శించిన గుర్తుగా ఒక్కో వారం ఒక్కో రంగు స్టిక్కర్ ఇంటికి అంటిస్తారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికి వెళుతూనే ఇంట్లో వారి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుంటారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే నమోదు చేసుకుని సమీప ఆసుపత్రికి అంబూలెన్స్ లో తరలిస్తారు. ఇంట్లో అనారోగ్యంతో ఎవరు బాధపడుతున్న వారి వివరాలను అందించాలని జిల్లా కలెక్టర్ నివాస్ కోరారు.

You might also like