డిస్పూర్: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల దాటికి మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33 కిచేరింది.
ఈ వరదల కారణంగా రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 15 లక్షల మంది తీవ్ర ప్రభావానికి గురైనట్టు అస్సాం విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా వరదల్లో చిక్కుకున్న, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 27 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్టు తెలిపారు.