FbTelugu

ఎన్నికల సంఘానికి హైకోర్టులో ఊరట

* బీజేపీకి షాక్ ఇచ్చిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల్లో స్వస్తిక్‌ గుర్తుపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ ముగిసింది. ఓటరు స్లిప్పులపై స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర గుర్తులుంటే (పెన్నుతో టిక్, ఇతర) పరిగణలోకి తీసుకోవడం అనేది రిటర్నింగ్‌ ఆఫీసర్ దే తుది నిర్ణయంగా హైకోర్టు తేల్చి చెప్పింది.

దీనిపై ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చే అధికారం ఉందని తెలిపింది. స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర పరికరాలపై కూడా ఈసీ ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపుతూ.. బీజేపీ పిటిషన్ కొట్టివేసింది. ఈ సందర్భంగా నేరెడ్‌మెట్‌ కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టాలంటూ ఆదేశించింది. ఇప్పటికీ వరకు 504 ఓట్లు లెక్కించగా.. ఇంకా 544 ఓట్లు లెక్కించాల్సి ఉంది.ఎన్నికల వివాదాలపై ఎన్నికల ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.