FbTelugu

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మందికి తీవ్ర గాయాలు

విశాఖపట్నం: బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని మధురవాడ కార్ షెడ్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వైపుగా వెళుతున్న ఓ బస్సు అటుగా వచ్చిన మరో లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు బోల్తా పడింది. బస్సులోని సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.